AP: కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు ఇవాళ, రేపు (అక్టోబర్ 15, 16) సెలవులు ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఈవోలు తెలిపారు. ఇప్పటికే విద్యార్థులు, ఉపాధ్యాయులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. అలాగే ఈ రెండు రోజులలో జరగాల్సిన FA-2 పరీక్షలను అక్టోబర్ 17, 18 తేదీలకు మార్చినట్లు వెల్లడించారు.