AP: తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ, రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దీని నేపథ్యంలో అధికార యంత్రాంగం చేపట్టిన ముందస్తు చర్యలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పశ్చిమ గోదావరి, కోనసీమ, అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అధికారులు శుక్రవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.