ఉత్తరప్రదేశ్‌లోని ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు రివర్స్ చేస్తుండగా వేగంగా వచ్చిన స్కార్పియో ఢీకొట్టింది. ఈ క్రమంలో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. స్కార్పియో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.