ఏపీలో స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ కీటకం కుట్టడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 1,317 మందికి పాజిటివ్ కేసులు నమోదై ఆసుపత్రుల పాలయ్యారు. విజయనగరం జిల్లాలో ఒక మహిళ మృతి చెందారు. చిత్తూరు, కాకినాడ, విశాఖపట్నం వంటి జిల్లాల్లో అధిక కేసులు నమోదయ్యాయి. వైద్యులు అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు కనిపించగానే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. సాధారణ యాంటిబయాటిక్స్‌తో ఈ వ్యాధి నయం అవుతుందని తెలిపారు.