AP: విజయనగరం జిల్లా ఎస్.కోటలో హోంగార్డు నెట్టి శ్రీనివాసరావు నివాసంలో ఏసీబీ తనిఖీలు చేసింది. అక్రమ సంపాదనతో రూ.20 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం, గుర్లతోపాటు విశాఖలో రెండు చోట్ల తనిఖీలు చేపట్టారు. శ్రీనివాసరావు సుమారు 15 ఏళ్లుగా హోంగార్డుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.