120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు

44చూసినవారు
120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు
AP: రాష్ట్రంలోని 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, పల్నాడు జిల్లా నరసరావుపేట తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్