AP: విజయవాడలో సచివాలయ ఉద్యోగుల నిరసన కార్యక్రమం రాత్రి వరకు కొనసాగింది. ఉద్యోగులు సెల్‌ఫోన్ టార్చ్‌లైట్లు ఆన్ చేసి ‘మాకు న్యాయం చేయండి’ అంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు సెలవు రోజుల్లో విధులు కేటాయించవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.