ఉగ్రవాద వ్యతిరేక మాక్ డ్రిల్‌ నిర్వహించిన భద్రత బలగాలు (వీడియో)

8690చూసినవారు
శ్రీ అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి ముందు, శ్రీనగర్‌లోని పఠాన్ చౌక్ బేస్ క్యాంప్‌లో ఉగ్రవాద వ్యతిరేక మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. కొత్తగా నిర్మించిన 'శ్రీ ప్రేమ్ గార్గ్ భవన్' యాత్రి నివాస్ వద్ద జమ్మూ కాశ్మీర్ పోలీసులు, పారామిలిటరీ బలగాలు ఈ డ్రిల్ ను చేపట్టాయి. యాత్ర సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు, సన్నద్ధతను పరీక్షించేందుకు ఉద్దేశించి నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. యాత్రికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఎలాంటి అవాంఛనీయ  ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు  తెలిపారు.
VEDIO CEREDIT: ANI

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్