AP: రాష్ట్రంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విజయవాడలో మావోయిస్టుల అరెస్టుతో అలర్ట్ అయిన పోలీసులు శుక్రవారం ఏపీ సచివాలయం వద్ద భద్రతను భారీగా పెంచారు. విజయవాడ పరిసరాల్లో మావోయిస్టులు మరోసారి రెక్కీ నిర్వహించారనే అనుమానంతో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. సచివాలయంలోకి వచ్చే ఉద్యోగుల ఐడీ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వారిని లోపలికి అనుమతిస్తున్నారు.