AP: పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి వర్మకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. టీడీపీ నేత వర్మ ఎక్కువగా తీర ప్రాంతాల్లో పర్యటించడంతోపాటు పార్టీల మధ్య స్వల్ప గొడవల నేపథ్యంలో అతని భద్రత కోసం 2+2 గన్‌మెన్లను కేటాయించింది. ఈ మేరకు వారు గురువారం నుంచే విధుల్లో చేరారు. రెండ్రోజుల క్రితం సీఎం చంద్రబాబును వర్మ కలవగా.. వెంటనే భద్రత కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.