జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ సంస్థాగత కమిటీలపై దృష్టి సారించారు. ఆదివారం కీలక నేతలతో సమావేశమై 'సేనాగళం' కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీ యువత (జెన్‌జీ) గళం వినిపించడమే లక్ష్యంగా అభ్యుదయ భావాలతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. కులాల వారీగా విమర్శించే ధోరణిని విడనాడి, వ్యక్తుల తప్పులను వ్యక్తిగత స్థాయిలో ప్రశ్నించాలని సూచించారు.