కృష్ణాజిల్లా కంకిపాడులో జరిగిన బీజేపీ జ్యేష్ఠ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో సీనియర్ నేత ప్రకాష్ రెడ్డికి అస్వస్థతకు గురయ్యారు. స్టేజిపై మాట్లాడుతుండగా కిందపడిపోయారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సమావేశంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి సత్య కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.మాధవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.