AP: కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు గోగినేని శివరామకృష్ణ(60) అనారోగ్యం కారణంగా మృతి చెందారు. కొద్దిరోజుల కిందట బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన ఈయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. టీడీపీ పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లలోనే తెలుగు యువత నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, వడ్డే శోభనాద్రీశ్వరరావులకు అత్యంత సన్నిహితులు.