అయోధ్య రామమందిరం విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ పదవికి చంపత్ రాయ్ రాజీనామా చేయగా బోర్డు ఆమోదించింది. ఆయన స్థానంలో విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్న భజరంగ్ బగ్రాకు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ అయిన బగ్రా గతంలో ప్రభుత్వ రంగ సంస్థ NALCO ఛైర్మన్‌గా పనిచేశారు.