కేంద్ర ప్రభుత్వం టీవీ రంగంలో టీఆర్పీ విధానంలో కీలక మార్పులు చేసింది. 2026 డిజిటల్ అవసరాలకు అనుగుణంగా కొత్త పాలసీ ప్రవేశపెట్టి, చిన్న సంస్థలకు కూడా రేటింగ్ ఏజెన్సీలుగా అవకాశం కల్పించింది. మీటర్ల సంఖ్యను పెంచి గ్రామీణ ప్రాంతాల డేటాను కూడా చేర్చనుంది. కేబుల్, డీటీహెచ్‌తో పాటు ఓటీటీ, స్మార్ట్ టీవీ వీక్షణను పరిగణనలోకి తీసుకుంటారు. రేటింగ్ మానిప్యులేషన్ నివారించేందుకు కఠిన నిబంధనలు, డబుల్ ఆడిట్ అమలు చేయనున్నారు. ఈ మార్పులతో పారదర్శకత, కచ్చితత్వం పెరుగుతుందని భావిస్తున్నారు.