ముగ్గురు సిస్టర్స్ సూసైడ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

9017చూసినవారు
ముగ్గురు సిస్టర్స్ సూసైడ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
TG: ఘజియాబాద్ సిస్టర్స్ సూసైడ్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆ ఇద్దరు సోదరీమణులు కొన్నేళ్ల క్రితం మరియ, అలీజా, సిండీ అనే కొరియన్ పేర్లతో సోషల్ మీడియా అకౌంట్లు సృష్టించారు. ఈ విషయం తండ్రి చేతన్ కుమార్‌కు తెలిసి పది రోజుల క్రితం ఆ అకౌంట్లను డిలీట్ చేయించాడని పోలీసులు తెలిపారు. రూ.2 కోట్ల అప్పుల్లో ఉన్న చేతన్ కుమార్ కరెంట్ బిల్లు చెల్లించేందుకు కుమార్తెల ఫోన్లను అమ్మేశాడని, వారికి బలవంతంగా పెళ్లి చేస్తానని బెదిరించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. కేసును పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్