AP: మాజీ మేయర్ కఠారీ అనురాధ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఐదుగురిని దోషులుగా నిర్ధారించిన చిత్తూరు జిల్లా కోర్టు శుక్రవారం మరణ శిక్ష ఖరారు చేసింది. ప్రభుత్వ కార్యాలయంలోనే జరిగిన ఈ హత్యోదంతాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కాగా, 2015, నవంబర్ 17న మున్సిపల్ కార్యాలయంలో వీరిద్దరూ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.