AP: ముందు జాగ్రత్త చర్యలతో ప్రాణ నష్టం లేకుండా నివారించగలిగామని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్‌లో ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది పెను విపత్తు. రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. చాలా వరకు ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నాం. గతంలో తుఫాన్ సమయంలో పని చేసిన అనుభవం ఉంది. మొంథా తుఫాన్ విషయంలో ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం’ అని అన్నారు.