ఏపీలో డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా వీసీని కోరారు. సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్ట్‌నర్ అరుణ్ కుమార్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఐటీ, డేటా హబ్‌గా విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన వివరించారు. సెమీకండక్టర్, ఏఐ (AI), క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.