నకిలీ మద్యం కేసులో పోలీసు కస్టడీకి ఏడుగురు నిందితులు

0చూసినవారు
నకిలీ మద్యం కేసులో పోలీసు కస్టడీకి ఏడుగురు నిందితులు
AP: నకిలీ మద్యం కేసులోకీలక పరిణామం చోటు చేసుకుంది. ఏడుగురు నిందితులను విజయవాడ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు పోలీసు కస్టడీకి ఇచ్చింది. ఈనెల 7 నుంచి 11 వరకు కస్టడీకి తీసుకొని విచారించేందుకు అనుమతించింది. నకిలీ మద్యం కేసులో.. ఏ4 రవి, ఏ7 బాదల్‌ దాస్‌, ఏ8 ప్రదీప్‌ దాస్‌, ఏ11 శ్రీనివాస్‌రెడ్డి, ఏ12 కల్యాణ్, ఏ15 రమేష్‌ బాబు, ఏ16 అల్లాబక్షిని సిట్‌ అధికారులు విచారించనున్నారు. ఈ ఏడుగురు నిందితులు ప్రస్తుతం నకిలీ మద్యం కేసులో పలు జైళ్లలో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్