AP: విశాఖపట్నం సముద్రతీరంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. గల్లంతైన బోటులో ఒకరు సురక్షితంగా బయటపడగా, మిగతా ఆరుగురి ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్ గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. నేవీ హెలికాప్టర్ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్‌ను విస్తరించినట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.