AP: విశాఖ చేపలరేవు నుంచి చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ నెల 1వ తేదీన బయలుదేరిన వాళ్లు.. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం వరకు వారి కోసం ఎదురుచూశారు. ఫోన్లు పనిచేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని మత్స్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మరపడవల ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు జానకిరామ్ తెలిపారు.