AP: రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊబిచర్ల ఉన్నత పాఠశాలలో పదో తరగతి
ఫలితాలు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. కేవలం నలుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నప్పటికి.. వారందరూ ఉత్తీర్ణత సాధించడంలో విఫలమయ్యారు. తెలుగులో ఒకరు, సైన్స్‌లో ఒకరు, సాంఘిక శాస్త్రంలో ఇద్దరు
విద్యార్థులు ఫెయిలయ్యారు. దీనిపై ఎంఈఓ రవినాయక్ మాట్లాడుతూ, విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధిస్తారని ఆశించామని, అయితే
ఫలితాలు అనుకున్నట్లు రాలేదని తెలిపారు.