కారు ఢీకొని.. ఏడేళ్ల బాలిక మృతి (వీడియో)

19048చూసినవారు
మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా కవతల్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంత నుంచి తాతతో కలిసి ఇంటికి తిరిగి వస్తూ రోడ్డు దాటుతున్న ఏడేళ్ల బాలికను వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స ప్రారంభానికి ముందే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్