రామాయణ చిత్రానికి ఏడేళ్ల నిరీక్షణ: నితీశ్ తివారీ

1895చూసినవారు
రామాయణ చిత్రానికి ఏడేళ్ల నిరీక్షణ: నితీశ్ తివారీ
బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రంపై తాజా అప్‌డేట్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దర్శకుడు నితీశ్ తివారీ ఏడేళ్లుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు. రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ, 2000లో తన స్నేహితుడికి చెప్పిన కల ఇప్పుడు ‘రామాయణ’ చిత్రంతో నెరవేరిందన్నారు. తండ్రి అయిన తర్వాత ధైర్యంగా ఈ పాత్రను స్వీకరించానని తెలిపారు. సాయి పల్లవి సీతగా, యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం మొదటి భాగం దీపావళికి విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్