AP: 'మొంథా' తుఫాన్ ముప్పు నేపథ్యంలో రాష్ట్రంలోని పోర్టులకు విశాఖ వాతావరణ కేంద్రం ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. కాకినాడ పోర్టుకు అత్యధికంగా ఏడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరం పోర్టులకు ఆరో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఐదో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.