AP: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీఎఫ్ డీజీగా ఉన్న సీహెచ్ త్రివిక్రమ వర్మకు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చింది. ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న జయలక్ష్మి సీఐడీ సైబర్ క్రైమ్స్ ఐజీగా బదిలీ అయ్యారు. సీఐడీ ఉమెన్ సేఫ్టీ ఐజీగా రాజకుమారికి బాధ్యతలు అప్పగించారు. కాంతి రాణా టాటాకు ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ సేఫ్టీ ఐజీగా నియమితులయ్యారు.