ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం

15256చూసినవారు
ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం
AP: రాష్ట్రం వైపు తీవ్ర వాయుగుండం దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 5 కి.మీ వేగంతో కదులుతుందని APSDMA తెలిపింది.ఇది ప్రస్తుతం విశాఖపట్నానికి 120 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. బుధవారం రాత్రికి తీవ్రవాయుగుండంగా విశాఖపట్నం- గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో  ఇవాళ రాత్రి, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55-65 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.

సంబంధిత పోస్ట్