తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకడం ప్రారంభించింది. కళింగపట్నానికి నైరుతి సమీపంలో ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ మొదలైంది. మరో రెండు గంటల్లో పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు, గంటకు 60-75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.