మరో 2-3 గంటల్లో తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం

7చూసినవారు
మరో 2-3 గంటల్లో తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం
AP: బంగాళాఖాతం నుంచి వేగంగా దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో 13 కి.మీ. వేగంతో కదులుతోంది. ప్రస్తుతం ఇది కళింగపట్నానికి 30 కి.మీ., విశాఖకు 90 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరో 2-3 గంటల్లో కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే వేళ బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్