నేడు 40 ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు

5920చూసినవారు
నేడు 40 ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు
ఏపీలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేడు రాష్ట్రంలోని 40 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వీటిలో 19 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉండగా, మరో 21 మండలాల్లో సాధారణ వడగాలులు ఉంటాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా విజయనగరం, మన్యం జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది.. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుతుండగా, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్