నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు

10చూసినవారు
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
AP: రాష్ట్రంలో గురువారం ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. 46 మండలాల్లో తీవ్ర వేడిగాలులు, 79 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం టైంలో అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.

సంబంధిత పోస్ట్