AP: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి గురువారం ఉదయం 7 గంటల వరకు 80 ప్రాంతాల్లో 10 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు SDMA తెలిపింది. రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖపట్నంలోని తులసీనగర్లో 23.6 సెం.మీ. వర్షం కురిసింది. మధురవాడలో 21.8, ఎండాడలో 21, సీతమ్మధారలో 20.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తీవ్ర వాయుగుండం తీరం దాటినా మరో 12 గంటల పాటు అదే తీవ్రతతో కొనసాగనుంది.