AP: ఉత్తరాంధ్రకు అత్యంత సమీపంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. కళింగపట్నానికి దక్షిణంగా వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కోనసీమ, ఉ.గోదావరి, ఏలూరు, కృష్ణా,
ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.