AP: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లాలో ఉదయం నుంచి వాన కురుస్తూనే ఉంది. మార్కాపురం జిల్లాలోనూ వర్షం కురుస్తోంది. ఆదివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.