ట్రైనీ IPSపై లైంగిక వేధింపుల కేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

13212చూసినవారు
ట్రైనీ IPSపై లైంగిక వేధింపుల కేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
TG: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ట్రైనీ IPS ఉదయ్ విచారణలో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడైనట్లు సమాచారం. సివిల్స్ సాధించాక తన స్ఫూర్తిదాయక కథనాలను చూసి సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులుగా మారారని ఆయన చెప్పినట్లు తెలిసింది. అందులో కొందరు మహిళలు తనకు ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పానని, అందులో తప్పేముందని ఉదయ్ పోలీసులతో చెప్పినట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే, ఆయన తన హోదాను వ్యక్తిగత ఆకర్షణలకు వాడుకోవడం క్షమించరాని నేరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్