లైంగిక దాడికి గురై.. 14 ఏళ్లకే కాన్పు

10503చూసినవారు
లైంగిక దాడికి గురై.. 14 ఏళ్లకే కాన్పు
AP: రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. కర్నూలు నగరానికి చెందిన ఆటో డ్రైవర్ మహేంద్ర, అతని స్నేహితుడు శివకుమార్ కలిసి 14 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించి తల్లిని చేశారు. ఈ దారుణ ఘటన సోమవారం వెలుగుచూసింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాధిత బాలికను ఆటోలో స్కూల్‌కు పంపేవారు. ఆటో డ్రైవర్ మహేంద్ర ఆమెకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. శివకుమార్ కూడా ఆమెను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దాంతో బాలిక గర్భం దాల్చి.. ఈ నెల 28న మగబిడ్డకు జన్మనిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్