ఛాయా సోమేశ్వరాలయం.. ఆ 'నీడ' ఓ మాయ!

9602చూసినవారు
తెలంగాణలోని నల్లగొండ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో పానగొల్లులో ఉన్న ఛాయా సోమేశ్వరాలయం 800 ఏళ్ల నాటి అద్భుత నిర్మాణం. ఈ ఆలయం గర్భగుడి ముందున్న రెండు స్తంభాల వద్ద, వెలుతురు ఉన్నంతసేపు ఒకే చోట స్థిరంగా పడే నీడ భక్తులను ఆశ్చర్యపరుస్తోంది. సూర్యుడి గమనం మారినా, నీడలో మార్పు రాదు. ఇది ఏ వస్తువు నీడ అనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలింది. త్రికూటాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో, పడమటి గర్భగుడిలో మాత్రమే ఈ వింత నీడ కనిపిస్తుంది. దీనిని దేవుడి మాయగా భక్తులు విశ్వసిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్