షారుఖ్, ప్రియాంక ఒకే రకం: శైలేంద్ర సింగ్

6270చూసినవారు
షారుఖ్, ప్రియాంక ఒకే రకం: శైలేంద్ర సింగ్
బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా ఇద్దరూ ఒకే రకమైన మనస్తత్వం, క్రమశిక్షణ, వ్యాపార అవగాహన కలిగినవారని నిర్మాత శైలేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. వీరిద్దరినీ బాలీవుడ్ సరిగా వాడుకోలేదని, ప్రియాంకలోని అసలైన ప్రతిభను గుర్తించడంలో విఫలమైందని, సరైన మద్దతు లభించక, చేదు అనుభవాల వల్లే ఆమె హాలీవుడ్‌కు వెళ్లాల్సి వచ్చిందని, ఇది హిందీ చిత్ర పరిశ్రమకు నష్టమని ఆయన అన్నారు. కొందరి చేతుల్లోనే ఇండస్ట్రీ అధికారం ఉండటం వల్ల ప్రియాంక వంటి మేధావిని కోల్పోయామని, ఆమెకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్