శమీ వృక్షం ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా ఎంతో పవిత్రమైనంది. పాండవులు తమ ఆయుధాలను దీనిపైనే దాచిపెట్టారని పురాణాలు వివరిస్తున్నాయి.. శమీ వృక్షాన్ని ఇంటి బయట, ముఖ్యంగా దక్షిణ దిశలో నాటితే శుభఫలితాలుంటాయని వాస్తు శాస్త్రం వివరిస్తోంది. శనిదేవుని అనుగ్రహం లభిస్తాయి. ప్రతి శనివారం పూజ చేసి, ఆవనూనె దీపం వెలిగిస్తే శని దోషాలు తగ్గుతాయి. శివారాధనలో శమీ ఆకులను సమర్పించడం వల్ల శివుడి కటాక్షం లభిస్తుంది. ఆటంకాలు, ఏలినాటి శని ప్రభావం నుంచి ఉపశమనంతో పాటు, కుటుంబంలో శాంతి, వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుందని పెద్దలు చెబుతున్నారు.