హిందువులు శని త్రయోదశిని చాలా ప్రత్యేకంగా భావిస్తారు. జనవరి 31న వచ్చే ఈ విశిష్ట రోజున శనీశ్వరునికి పూజలు చేస్తే జాతకంలో శని దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. ఆ రోజున శని భగవానుడిని నువ్వుల నూనెతో అభిషేకం చేసి, నువ్వులు-బెల్లం కలిపిన పదార్ధాలు నైవేద్యంగా సమర్పించాలి. కాకులకు, చీమలకు ఆహారం పెట్టడం, రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడం వల్ల జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాల నుంచి విముక్తి కలుగుతుందని, శని ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.