ఎన్సీపీ విలీనంపై శరద్ పవార్ స్పందన

4507చూసినవారు
ఎన్సీపీ విలీనంపై శరద్ పవార్ స్పందన
అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీపీ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ స్పందించారు. ఎన్సీపీ విలీనానికి అజిత్ పవార్ అనుకూలంగా ఉండేవారని, ఫిబ్రవరి 12న రెండు వర్గాలు కలిసిపోవాలని ఆయన కోరుకున్నారని తెలిపారు. దురదృష్టవశాత్తు విమాన ప్రమాదం వల్ల చర్చలు ఆగిపోయాయని చెప్పారు. మరోవైపు, అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. కానీ దీనిపై తనకు సమాచారం లేదని శరద్ పవార్ అన్నారు. ప్రఫుల్‌ పటేల్, సునీల్‌ తట్కరె భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్