ట్రంప్ టారిఫ్‌ల ఎఫెక్ట్.. కుప్పకూలిన భారత ఫార్మా రంగ కంపెనీల షేర్లు

6647చూసినవారు
ట్రంప్ టారిఫ్‌ల ఎఫెక్ట్.. కుప్పకూలిన భారత ఫార్మా రంగ కంపెనీల షేర్లు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా నిర్ణయాలతో భారత ఫార్మా రంగానికి భారీ షాక్ తగిలింది. అమెరికాకు దిగుమతి అయ్యే భారతీయ ఔషధాలపై 100% టారిఫ్ విధించే యోచనలో ఉన్నట్లు వార్తలు రావడంతో ఫార్మా మార్కెట్‌లో కలకలం రేగింది. దీంతో సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, బయోకాన్ వంటి కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. అమెరికా మార్కెట్‌పై ఆధారపడిన భారత సంస్థలకు ఈ నిర్ణయం పెద్ద షాక్‌గా మారనుందని నిపుణులు భావిస్తున్నారు. టారిఫ్‌లు అమల్లోకి వస్తే ఎగుమతి ఖర్చులు పెరిగి కంపెనీల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్