AP: మొంథా తుపాన్ వల్ల రాష్ట్ర రైతాంగం తీవ్ర నష్టాన్ని చవిచూసిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో పంటనష్టం పరిశీలించిన ఆమె, రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఎకరాల్లో రూ.20 వేల కోట్ల నష్టం జరిగినప్పటికీ, ప్రభుత్వం కేవలం రూ.800 కోట్లు మాత్రమే చూపిస్తోందని విమర్శించారు. తుఫాన్‌ని జాతీయ విపత్తుగా ప్రకటించి, ప్రతి రైతుకూ ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.