AP: సీఎం చంద్రబాబు పాలనపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్ల కూటమి పాలనపై విడుదలైన ప్రోగ్రెస్ రిపోర్టును 'ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్' అని అభివర్ణించారు. ఇది ప్రగతి నివేదిక కాదని, పూర్తిగా గతి తప్పిన నివేదిక అని ఆరోపించారు. నాలుగు సూత్రాల పాలన అపహాస్యం, అభివృద్ధి బూటకం, సంపద సృష్టి మోసం, సమతుల్యత పచ్చి అబద్ధం, సంక్షేమం టోకరా అని పేర్కొన్నారు. కూటమి పాలన విధ్వంసం నుంచి అగాధం వైపు, అధిక అప్పుల నుంచి అంధకారం వైపు కొనసాగుతుందని వెల్లడించారు.