APPSC ఛైర్మన్‌గా శశిధర్

11867చూసినవారు
APPSC ఛైర్మన్‌గా శశిధర్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఛైర్మన్‌గా ఏఆర్ అనురాధ పదవీకాలం గురువారంతో ముగిసింది. ఆమె స్థానంలో సర్వీస్ కమిషన్‌లో అత్యంత జూనియర్ సభ్యుడైన సి.శశిధర్‌కు ఛైర్మన్‌గా అదనపు బాధ్యతల్ని ప్రభుత్వం అప్పగించింది. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పట్టన్‌శెట్టి రవిసుభాష్ నియమితులయ్యారు. కాగా, ఏఆర్ అనురాధ దాదాపు ఏడాది కాలంలో పలు పరీక్షలను పూర్తి చేయగా.. మరికొన్నినోటిఫికేషన్లు జారీ చేయడంతో పాటు నియామకాలు సైతం పూర్తి చేశారు.