AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు షాక్ ఇచ్చే పరిణామం చోటుచేసుకుంది. అనూహ్యంగా పురందేశ్వరి టీమ్‌లో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి చోటు లభించింది. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు భారత పార్లమెంటరీ బృందంలో మిథున్ రెడ్డికి ప్రాతినిధ్యం కల్పిస్తూ మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంపీ మిథున్ రెడ్డిపై రాష్ట్రంలో నమోదైన కేసులకు కేంద్రం మద్దతు లేదని టాక్. కాగా, ఈ టీమ్‌లో టీడీపీ నుంచి ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.