ఎల్ నినో ఎఫెక్ట్.. జులైలోనూ తక్కువ వర్షాలు!

12295చూసినవారు
ఎల్ నినో ఎఫెక్ట్.. జులైలోనూ తక్కువ వర్షాలు!
ఎల్ నినో ప్రభావంతో జూలై నెలలో కూడా దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. జూలైలో వర్షపాతం దీర్ఘకాల సగటు కంటే 94 శాతం తక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ఇది వ్యవసాయం, నీటి వనరులకు సవాళ్లను సృష్టించవచ్చని హెచ్చరించింది. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జూన్ నెలలో కూడా లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో, రైతులు జూలై, ఆగస్టు నెలలపై ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఐఎండీ అంచనాలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్