AP: కడప జిల్లా, పులివెందులలో మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. లింగాల మండలం, అంబకపల్లె గ్రామానికి చెందిన 20 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి, టీడీపీలో చేరాయి. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎన్‌డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై తాము టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. పులివెందులను బీటెక్ రవి ప్రగతి పథంలో నడిపిస్తున్నారని వారు కొనియాడారు.