AP: పులివెందులలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్ రవి సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. స్థానిక ఫిజియోథెరపిస్ట్ కొంగనపల్లి వెంకట సాయి కిషోర్, వెంటేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, పలువురు వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి బీటెక్ రవి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీలో వారికి తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో వారు టీడీపీలోకి వచ్చినట్లు సమాచారం.